Thursday, 29 September 2016

'ఘటన' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌లో విడుదల

'ద శ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్యకావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమే ల్‌ కొట్టాయం' చిత్రాన్ని సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ - ''ద శ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్‌, తమిళంలో కమల్‌హాసన్‌గారు చేశారు. తెలుగులో, తమిళ్‌లో ఈ చిత్రం పెద్ద హిట్‌ అయింది. ద శ్యం తర్వాత నేను తెలుగులో చేస్తున్న సినిమా 'ఘటన'. ఆడదంటే ఆటబొమ్మ కాదు.., ఏదైనా చేయగల ఆది పరాశక్తి అని తెలియజేసే చిత్ర మిది. సినిమా కమర్షియ ల్‌గా ఉంటుంది. సినిమాలో మెయిన్‌రోల్‌లో నిత్యా మీనన్‌ అద్భుతంగా నటించింది. సమాజం లో జరిగే విషయాలను ఈ సినిమాలో ఒక పర్సనల్‌ వ్యక్తికి జరిగినప్పుడు, ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా'' అన్నారు. 

రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - ''సినిమా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌. నర్సు ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్ళే అమ్మాయిలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఒక వ్యక్తి ఆధారంగా చేసుకుని శ్రీప్రియగారు తెరకెక్కించారు. ఇలాంటి మహిళా సబ్జెక్ట్‌ను డీల్‌ చేయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్‌. శ్రీప్రియగారు సినిమాను చాలా బాగా తీశారు'' అన్నారు. 

నిర్మాత వి.ఆర్‌. కృష్ణ ఎం. మాట్లాడుతూ - ''ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మలయాళంలో సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్‌తో వున్నాం'' అన్నారు. 
నిత్యామీనన్‌, క్రిష్‌ జె. సత్తార్‌, నరేష్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, విద్యుల్లేఖ రామన్‌, అంజలీరావు, జానకి, గౌతమి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: మనోజ్‌ పిళ్ళై, ఎడిటింగ్‌: బవన్‌ శ్రీకుమార్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: ప్రేమ్‌నవాస్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అను పార్థసారథి, సమర్పణ: బేబి సంస్కృతి ఎం, బేబీ అక్షర ఎం, నిర్మాత: వి.ఆర్‌. కృష్ణ ఎం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీప్రియ

Wednesday, 28 September 2016

'ఈడు గోల్డ్‌ ఎహే' సెన్సార్‌ పూర్తి - అక్టోబర్‌ 7 విడుదల

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

ఆ వివరాలను నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలియజేస్తూ - ''ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే నాలుగు పట్టణాల్లో విడుదలైన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సునీల్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. అలాగే మా బేనర్‌కి మరో మంచి కమర్షియల్‌ హిట్‌ సినిమా అవుతుంది. విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు. 

స్టార్‌ సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా|| నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు. 

EEDU GOLD YEHE


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల. 

Tuesday, 27 September 2016

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చేతుల మీదుగా న‌రుడా..!డోన‌రుడా..! థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల‌





హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప‌ల్ల‌వి సుభాష్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో త‌నికెళ్ళ‌భ‌ర‌ణి ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు.  గోల్కొండ హైస్కూల్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రాల‌కు అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన మ‌ల్లిక్‌రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. 

ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైల‌ర్ ను సూపర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసి సుమంత్ అండ్ టీంకు అభినంద‌న‌లు తెలియజేశారు. వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో పాటు, టైటిల్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. సోష‌ల్ మీడియాలో ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన సుమంత్‌ను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, వీర్య‌దాత విక్కీగా సుమంత్ న‌ట‌న‌తో పాటు త‌నికెళ్ళ‌భ‌ర‌ణి అసిస్టెంట్‌గా సుమ‌న్‌శెట్టి, హీరోయిన్ ప‌ల్ల‌వి సుభాష్‌లు త‌మ‌దైన శైళిలో ట్రైల‌ర్ క‌నువిందు చేశారు. 

ఈ చిత్రంలో శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సినిమాటోగ్ర‌ఫీః షానియల్ డియో, మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌, ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి, డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌, నిర్మాత‌లుః వై.సుప్రియ‌, సుధీర్ పూదోట‌, ద‌ర్శ‌క‌త్వంః మ‌ల్లిక్ రామ్‌. 


More news in English Onlineap